తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూత..! 6 d ago
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యతో అమెరికాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అయన మృతి చెందారు. జాకీర్ హుస్సేన్ పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. తబలా మ్యాస్ట్రోగా ప్రఖ్యాతిగాంచిన అయన 1951 మార్చ్ 9న ముంబైలో జన్మించారు. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజన్ లో నైపుణ్యత సాధించి తనదైన ముద్ర వేశారు. అయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపుతున్నారు.